హైదరాబాద్ నగరం గురించి సూపర్ స్టార్ రజనీకాంగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్ లో ఉన్నాన్నా.. న్యూయార్క్ లో ఉన్నాన్నా.. అని ఇక్కడి అభివృద్ది గురించి ఆయన మాట్లాడారని హరీశ్ రావు అన్నారు.
మరికొన్ని గంటల్లో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. దీంతో నూతన సచివాలయానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్ లో 600 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేయనున్నారు.
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది.
Rains In Hyderabad: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో రానున్న మూడు గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది. జంట నగరాలు భారీ వర్షానికి తడిచి ముద్దైంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది.
ప్రతిరోజూ ఎన్నో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటు ఉంటాయి. కొంతమంది చేసే పనులు చాలా వింతగా అనిపిస్తుంటాయి. కొందరు ఎవరూ ఊహించని కొన్ని విచిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు.
దేశవ్యాప్తంగా 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో భాగంగా, నేడు రామగుండం రిలే స్టేషన్ను వర్చువల్ మోడ్లో ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఎఫ్ఎం రేడియో సేవలు అలరించబోతున్నాయి.
భారతదేశంలో బలమైన ఉనికిని పెంపొందిస్తూ ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స గురువారం రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మ్యూనిచ్ నుండి బెంగళూరు, ఫ్రాంక్ఫర్ట్ నుండి హైదరాబాద్కు రెండు కొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నట్లు లుఫ్తాన్స ప్రకటించింది.
Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త అందించింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది.