Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లు వినియోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. నిన్నటి (జూన్ 2) నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్‌లో మరుగుదొడ్డికి రూ.5, మూత్ర విసర్జనకు రూ.2 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించినందుకు ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. అయితే ఇక నుంచి వారికి డబ్బులు వసూలు చేస్తారు. దీంతో ఇప్పటికే మెట్రో ఛార్జీల రాయితీల కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజా నిర్ణయం మరింత భారం కానుంది.
ఇటీవల మెట్రో చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లు మరియు క్యూఆర్ కోడ్‌తో ప్రయాణించే వారికి ఇప్పటి వరకు ఛార్జీలపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ రాయితీ నాన్-పీక్ అవర్స్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. అదేవిధంగా, సూపర్ సేవర్ ఆఫర్ కూడా ఛార్జీలను రూ.100కి పెంచింది, ఇది గుర్తించిన సెలవు దినాలలో కేవలం రూ.59తో అపరిమితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. గత కొంత కాలంగా హైదరాబాద్ మెట్రో అధికారులు ఆదాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించారు. మెట్రో ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన మెట్రో మాల్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. తాజాగా టాయిలెట్ వాడితే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మెట్రో ప్రయాణికులపై ఈ ఛార్జీలు మరింత భారంగా మారనున్నాయి.
Read also: Brij Bhushan : చెప్పినట్టు వింటేనే కెరీర్ ఉంటుంది.. లేకపోతే నాశనం చేస్తా..
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టడంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం నగరానికి వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ విభాగంతో పాటు ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం, పనులు చేపట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. దీంతో పాటు మెట్రోను నిర్మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు ఆదాయ మార్గాలను పెంచే లక్ష్యంతో మెట్రో స్టేషన్లలో టాయిలెట్లకు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.
Brij Bhushan : చెప్పినట్టు వింటేనే కెరీర్ ఉంటుంది.. లేకపోతే నాశనం చేస్తా..