Beer Sales: వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు లిక్కర్ అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.. ఎండల తీవ్రత పెరడగంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో లిక్కర్కంటే బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. మార్చి నుంచి మే 14వ తేదీ వరకు అంటే 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లుతో పాటు 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ను లాగించారు మందుబాబులు.. అంటే, లిక్కర్‌తో పోలిస్తే బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి.. దాదాపు 4 కోట్ల లీటర్ల బీరు అధికంగా తాగిసినట్టే రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత రికార్డులను తిరగరాస్తూ.. ఒక్క నెలలో 7.44 కోట్ల బీర్లు మంచినీళ్లుగా తాగారు. మే నెలలో ఎండలు మండడం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఒక్క మే నెలలోనే రికార్డు స్థాయిలో 7.44 కోట్ల బీర్ బాటిళ్లు అమ్ముడుపోయినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2019 మే నెలలో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక తాజాగా ఆ రికార్డును బద్దలు కొడుతూ తెలంగాణలోని డ్రగ్స్ బానిసలు 7.44 కోట్ల బీరును మంచినీళ్లుగా తాగారు. ఎండలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాల కారణంగా బీర్ల విక్రయాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
Read also: C Kalyan: ఫస్ట్ డే పస్ట్ షో సక్సస్ అవుతుంది… ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
అయితే ఈ రేంజ్ లో ఒకే ఒక్క బీర్ బాటిల్ అమ్ముడుపోతే.. టోటల్ సేల్స్ రేంజ్ ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయి. వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. ఇందులో మద్యం సరఫరా కూడా ఉంది. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.35,145.10 కోట్ల విలువైన 3.52 కోట్ల మద్యం కేసులు, 4.79 కోట్ల బీరు కేసులు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఎండల తీవ్రత మొదలైనప్పట్టి నుంచి మద్యం అమ్మకాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లా తొలిస్థానంలో ఉండగా.. వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.. రంగారెడ్డి జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీర్లు తాగితే.. తర్వాతి స్థానంలో ఉన్న వరంగల్లో కోటి 15 లక్షల లీటర్ల బీర్లు లాగించేశారు మద్యం ప్రియులు.. అయితే, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో కూడా మద్యం అమ్మకాలు పెరగడడానికి కారణం అవుతోంది.
Sudan : సూడాన్‌లో ఆకలితో 60 మంది చిన్నారులు మృతి