హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఊరేగింపులతో గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ... ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది.
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. రెండు గంటలు ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభం కావడంతో వేగంగా ముందుకు సాగుతోన్న బడా గణపతి.. వడివడిగా పోలీసులు కదిలిస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్ లో గణేష్ లను దారి మళ్లిస్తున్నారు. వినాయకులన్నిటినీ ట్యాంక్ బండ్ వైపు దారి మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభం కావడంతో రోడ్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సచివాలయం వద్ద గణేష్ క్యూ లైన్ చూస్తుంటే… ఈసారి…
తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుపై ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగానే బయటపెట్టింది కవిత. అంతేకాదు సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నాడని తెలిపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత…
బాలాపూర్‌లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య..
తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలివెళుతున్నాడు. గణపయ్య భక్తులు డప్పు చప్పుళ్లతో, భజనలతో, ఆటపాటలతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. గణేష్ శోభాయాత్ర కన్నులపండుగగా జరుగుతోంది. ఇక వినాయక వేడుకల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది గణేష్ లడ్డూ. నిమజ్జనానికి ముదు లడ్డూ వేలం పాట వేస్తుంటారు నిర్వాహకులు. విఘ్నేషుడి లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. వినాయకుడి లడ్డూ సొంతం చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే ఐష్టైశ్వర్యాలు సిద్ధి్స్తాయని.. సుఖశాంతులు విలసిల్లుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. Also Read:Nag Ashwin : ప్రధాని…
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. నగరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌కు బొజ్జ గణపయ్యలు తరలివస్తున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఖైరతాబాద్ గణేషుడి వైపే ఉంది. కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనం ఏర్పాట్లు.. కొనసాగుతున్న వెల్డింగ్ పనులు.. Also Read:Murder Case : గోల్డ్ వ్యాపారీ మిస్టరీ హత్య.. ఈ ఏడాది 69…
నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. “పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశాము.. 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుంది.. రేపు ఒక్క ట్యాంక్ బండ్ లోనే 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి.. నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాము.. నిన్న కూడా ఛత్రినాకలో ఒక ఘటన జరిగింది.. విగ్రహం ఎత్తు ఉండటం వల్ల కరెంట్ వైర్ కు తగలకుండా…
అల్వాల్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. యువతి కార్ లో ట్రాకింగ్ డివైస్ పెట్టీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్య పెళ్లి కొడుకు. స్థానిక నేత పై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని బాధితురాలి పై ఒత్తిడి చేస్తున్నాడు. జిమ్ లో పరిచయం అయిన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు నిత్య పెళ్లి కొడుకు రవి అలియాస్ రఫీ, అతడి సోదరుడు రూపేష్. బాధితురాలి ఆడియోలు మార్ఫిఫింగ్ చేసి యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు…
గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మెట్రో రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. లాస్ట్ ట్రైన్ మధ్యరాత్రి 1 గంట వరకు నడపనున్నట్లు వెల్లడించింది. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 7 వ తేదీ మధ్యరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. గణపయ్య భక్తులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అర్చకులు.. సీఎం రేవంత్ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు.. దేశంలోనే గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.. ఖైరతాబాద్ గణేశుని కి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.. 1 లక్ష నలభై వేల విగ్రహాలు ఈ సారి నగరంలో ప్రతిష్టించారు..…