శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్‌లోడ్ కోసం రాంప్‌లను ఉపయోగించి ప్రవేశించగలవు. వింగ్ ప్రాంతాలు – 6760 చదరపు అడుగులు. ఖాళీ విమానాల బరువు – 1,81,000 కిలోలు.