Off The Record: జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ కోసం భారీగా మహిళా నేతలు పోటీ..!
- ముగ్గురి పేర్లతో త్వరలో కేంద్ర పార్టీకి లిస్ట్..
- టిక్కెట్ ఆశావహుల్లో మహిళలే ఎక్కువ..
- నాకొక్క ఛాన్స్ అంటున్న జూటూరు కీర్తిరెడ్డి..
- ట్రయల్స్‌లో డాక్టర్ వీరపనేని పద్మ..
- గట్టి ప్రయత్నాల్లో ఉన్న ఆకుల విజయ..
- పెద్ద నేతలతో అభిప్రాయ సేకరణ కమిటీకి చెప్పించుకున్నారా?..
- రేస్‌లోకి వచ్చిన మాధవీలత..
- బరిలో బండారు దత్తన్న కూతురు విజయలక్ష్మి..
- పార్టీ అడిగితే పోటీ చేస్తానంటున్న బండ కార్తీకరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడుతుంది. కానీ… బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అసలా విషయంలో ఒక క్లారిటీ ఉందో లేదో కూడా బయటికి తెలియడం లేదు. అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు నాయకులతో కమిటీ వేసి అభిప్రాయ సేకరణ కూడా చేసింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలో… త్వరలోనే ముగ్గురు పేర్లతో రాష్ర్ట ఎన్నికల కమిటీ కేంద్ర పార్టీకి లిస్ట్ పంపబోతోందట. మరోవైపు ఈసారిపార్టీ టిక్కెట్ ఆశిస్తున్న వాళ్ళ లిస్ట్ చాంతాడంత ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. జూబ్లీహిల్స్ కమలం టిక్కెట్ ఆశిస్తున్న వారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో కొందరైతే గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం రేస్‌లో అరడజన్‌కు పైగా మహిళా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన జూటూరు కీర్తి రెడ్డి ఈసారి నాకో ఛాన్స్ అంటున్నారట. అందుకు తగ్గట్టే… ఆమె నియోజకవర్గంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కూడా. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ వీరపనేని పద్మ కూడా సీటు ట్రయల్స్‌లో ఉన్నారు. తనకు సామాజికవర్గం కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారట ఆమె.
Read Also: Samantha : సమంత మొదటి సంపాదన ఎంతో తెలుసా..?
Also Read
ఇక మరో మహిళా నేత ఆకుల విజయ కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నట్టు సమాచారం. పార్టీకి చెందిన కొందరు పెద్ద నేతలతో కూడా రికమండ్ చేయించుకుంటున్నారట ఆమె. ఆ నేతలు అభిప్రాయ సేకరణ కమిటీ ముందు తమ మనసులో మాట చెప్పేసినట్టు తెలుస్తోంది. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాధవీలత కూడా టికెట్ రేస్‌లోకి వచ్చేశారట. ఆమె తనకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. రీసెంట్‌గా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్‌రావును కలిశారు జయసుధ. దీంతో ఆమె పేరు కూడా జూబ్లీ హిల్స్ అభ్యర్ధిగా తెరపైకి వచ్చింది.
ఇక బండారు దత్తాత్రేయ కూతురు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయ లక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. విజయలక్ష్మి పేరు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వినిపించింది… సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక సీట్ నుండి ఆమె పోటీ చేయవచ్చన్న ప్రచారం జరిగినా… సాధ్యపడలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి కూడా పార్టీ అడిగితే… పోటీకి సిద్ధమని అంటున్నారట. ఈ రకంగా జూబ్లీహిల్స్ కోసం తెంలగాణ బీజేపీలో మహిళా నేతలు మేమంటే మేమంటూ పోటీలు పడుతున్నారు. ఎవరికంటే ఏం తక్కువ కాదంటూ… సీరియస్ ట్రల్స్‌లో ఉన్నారట. దీంతో పార్టీ అధిష్టానం ఎవరివైపు మొగ్గుకతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!