హైదరాబాద్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు SHREE TMT హైదరాబాద్ రన్ – మైండ్ ఓవర్ మైల్స్ పేరుతో 10K & 5K రన్ నవంబర్ 9న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన అంశం. అయినప్పటికీ మన సమాజంలో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, Orange Hub Events ఆధ్వర్యంలో SHREE TMT టైటిల్ స్పాన్సర్‌గా Mind Over Miles –…
మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.. Also Read:Horrific Incident in Visakha: విశాఖలో…
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2,3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన & జంట జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. Also Read:CM Revanth…
తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను మరో విషాదం వెంటాడింది. ఆయన సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన సి. నాగరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. చిన్ననాటి నుంచి అల్లు అరవింద్ స్నేహితుడైన నాగరాజు, అల్లు అరవింద్‌తో కలిసి ఉండాలని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘మాస్టర్’ సినిమా నుంచి ఆయన గీతా ఆర్ట్స్ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. Also Read : Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు…
Ganesh Immersion: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా రెండో రోజు కూడా భారీగా శోభయాత్రలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు హృదయపూర్వకంగా గణేశుని పరాయణం చేస్తూ శోభయాత్రను జరుపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వైపు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు అనేక గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మరోవైపు పాత బస్తీ ప్రాంతం నుంచి మార్కెట్ దాకా వేలాది మంది భక్తులు పాల్గొని గణేశుని శోభాయాత్రను…
దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా DRF సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ కలహాలతో మానసిక ఆవేదనకు గురైన రహీం అనే వ్యక్తి చెరువులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు.
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. గణపయ్య భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. నగరంలో అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఈ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా బడా గణేషుడు హుస్సేన్ సాగర్ కు తరలివెళ్లాడు. Also Read:KantaraChapter1: కాంతారా -1 మలయాళ…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తుల నడుమ వేలం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ ధర సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. వేలంలో రూ. 35 లక్షలు పలికింది. లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. 2024లో రూ.30.01 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది..…
ఖైరతాబాద్ గణేషే కాదు బాలాపూర్ లడ్డూ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్‌లో మహా నిమజ్జనం అంటే తొలుత అందరి చూపు బాలాపూర్ లడ్డూవైపే.ఈసారి వేలం ఎంత ఉత్కంఠగా జరుగుతోంది.లడ్డూ ధర ఎంత పలుకుతోంది?సరికొత్త రికార్డ్ బ్రేక్ అవుతుందా? ఎవరి నోట విన్నా ఇదే మాట. బాలాపూర్ గణపతి లడ్డూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో పలుకుతూ ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ లడ్డూ చరిత్ర ఎంతో ఘనమైంది.దీన్ని కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనేది సెంటిమెంట్.లంబోదరుడి చేతిలో పూజలు…