ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు అని గుర్తుచేశారు
Mallu Bhatti Vikramarka: యునైటెడ్ స్టేట్స్ కాన్స్ లేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన యుఎస్ 248 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాన్సిలేట్ జనరల్ జెన్నీ ఫర్ లార్సన్, యు.ఎస్ ఎంబర్సీ రేర్ అడ్మిరోల్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో అమెరికా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఈ…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావని ప్రముఖ సినీ నటుడు ఎం. మురళీ మోహన్ అన్నారు. ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో, శనివారం జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ ఛాంబర్ లో జరిగిన అక్కినేని శత జయంతి, అక్కినేని యువ హీరోగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “అక్కినేని యువ ఎక్సలెన్సు అవార్డు” ను ప్రముఖ యువహీరో హీరో వరుణ్ సందేశ్ కు మురళీ…
ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి, నీరు, ఇతర పన్నులను సంబంధించి సమర్థవంతంగా రికవరీ చేయడానికి.. డిఫాల్టర్లను మెరుగ్గా ట్రాకింగ్ చేయడానికి GIS ఆధారిత సర్వేకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.., ప్రతీ ప్లాట్, భవనం యొక్క సరిహద్దులను తెలుసుకోవడానికి సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ తో ఉపగ్రహ డేటా, డ్రోన్ లను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ సంఫర్బంగా ఆస్తులను తక్కువ అంచనా…
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలతో ప్రేమలో పడి తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్‌లను ఇన్స్టాల్ చేస్తున్నారు.
Prajavani: ఎన్నికల కోడ్‌తో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి మళ్లీ ప్రారంభం కానుంది. నేటి నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Hyderabad People: వర్షం వస్తే చాలు భయపడాల్సి వస్తుందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాపూర్ వాసులు, స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.