Tax on Mobile Data : మొబైల్ డేటాపై కొత్త పన్ను..! ఒక్క జీబీ డేటాపై ఎంత చెల్లించాలంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tax on Mobile Data : జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక రకాల పన్నులను ప్రజలు చెల్లించాల్సిన పరిస్థితి.. ఎంతలా అంటే.. ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు నుంచి వినియోగం వరకు వివిధ దశల్లో పన్నుల భారం మోయాల్సిన పరిస్థితి.. ఇక, ఇప్పుడు.. భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం భవిష్యత్తులో మరింత ఖరీదైనదిగా మారే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం ఈ విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని (DoT) ను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.
ప్రతి GB డేటాకు రూ.1 పన్ను ప్రతిపాదన
మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పరిశీలిస్తున్న ఒక ప్రతిపాదన ప్రకారం ప్రతి జీబీ మొబైల్ డేటా వినియోగంపై రూ.1 పన్ను విధించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే వినియోగదారులు ఉపయోగించే డేటా పరిమాణానికి అనుగుణంగా అదనపు ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు. అంచనాల ప్రకారం ప్రతి GB డేటాపై రూ.1 పన్ను అమలు చేస్తే ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.22,900 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఇప్పటికే 18 శాతం GST
ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్‌లు మరియు పోస్ట్‌పెయిడ్ బిల్లులపై 18 శాతం Goods and Services Tax (GST) అమలులో ఉంది. అంటే టెలికాం సేవలపై వినియోగదారులు ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్నారు. డేటాపై ప్రత్యేక పన్ను అమలు చేస్తే అది ఇప్పటికే ఉన్న పన్నులకు అదనంగా ఉండే అవకాశం ఉంది.. ప్రపంచంలో చౌకైన మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. తక్కువ ధరల కారణంగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్, రీల్స్ వంటి కారణాలతో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతోంది.
తుది నిర్ణయం..!
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై అధ్యయనం మాత్రమే జరుగుతోంది. దాని లాభనష్టాలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ వార్త సోషల్ మీడియా వేదికలలో, ముఖ్యంగా Reddit వంటి ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. చాలా మంది ఈ న్యూస్‌ను షేర్ చేస్తున్నారు.. ఉదాహరణకు.. అన్ని టెలికం సంస్థలు.. 1 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ ఇలా రోజువారి డేటాతో.. 28 డేస్, 54 డేస్, 98 డేస్.. ఇలా ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి.. అంటే, ఈ డేటా ట్యాక్స్ అమల్లోకి వస్తే మాత్రం.. ప్రతి రోజు 1 జీబీ డేటా అంటే.. మీ రీఛార్జ్ ప్లాన్‌ను బట్టి.. ప్రతి రోజుకు రూపాయి అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి.. 1.5 జీబీ అయితే రూ.1.50 పైసలు ప్రతిరోజు అదనంగా చెల్లించాల్సిన అవసరం రానుండగా.. 2 జీబీ డేటాపై ప్రతి రోజుకు అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది.. అంటే మీ ప్లాన్ బట్టి.. అదనంగా డబ్బులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.. ఇది అధ్యయన దశలోనే ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..
తాజావార్తలు
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్‌లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!