జూన్ 16న దేశవ్యాప్తంగా 80 కేంద్రాల్లో నిర్వహించనున్న సివిల్ సర్వీస్ యూపీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండలో ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. యూపీఎస్సీ GS పేపర్ I ఉదయం 9:30 నుండి 11:30 వరకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత యూపీఎస్సీ GS పేపర్ II మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. Hyderabad: రూ.2 కోట్ల విలువైన బంగారం,…
Extramarital Affairs: మాజీ మిస్ వైజాగ్ ఘటన మొరవక ముందే.. హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య పిల్లలపై దాడికి దిగాడు.
ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ పాయీలేట్ క్యాడెట్లకు అభినందనలు.. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలో అంకిత భావంతో పని చేయాలి అన్నారు.
మైనర్ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న అజయ్ కుమార్‌ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఘట్కేసర్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్‌ను శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్ చేశారు. టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తోంది ఈ దొంగల ముఠా. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు కావాలని అడిగారు ఆ దొంగలు.
ఇటీవల ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో.., అనేక రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని వంటలతో అందించడం కష్టంగా మారింది. నెల రోజుల క్రితం కిలో రూ. 20 – 30 (కేజీ) మధ్య ఉన్న రిటైల్ ఉల్లి ధరలు ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధరతో కిలో రూ.40 నుంచి 50 మధ్య పలుకుతున్నాయి. దింతో హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లలో ప్రస్తుతం ఉల్లిపాయలు బిర్యానీతో సహా అందించడం లేదని సమాచారం. Darshan Son: బూతులు,…
హైదరాబాద్‌లోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని జూన్ 14 శుక్రవారం నాడు బస్సు దిగే ప్రయత్నంలో కదులుతున్న టిజిఎస్ ఆర్టిసి బస్సు చక్రాల కింద పడి మరణించిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీజిఎస్ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో బాధితురాలు మెహ్రీన్ అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన అమ్మాయి హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం…
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.