Bharateeyudu 2: భాగ్యనగరంలో ‘భారతీయుడు 2’ సందడి.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్
- హైదరాబాద్‌లో భారతీయుడు 2 సందడి
- జులై 7న భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu 2: యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ఇంకా ఎక్కువ సమయం లేకపోవడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. జులై 7న భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. జులై 7న సాయంత్రం 6 గంటల నుంచి ఎన్ కన్వెన్షన్‌లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.
Read Also: Nag Ashwin: కల్కిగా నటించబోయేది ఎవరంటే.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పీ, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. 28 ఏళ్ల ముందు గతంలో కమల్, శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తు్న్నారు.
‘భారతీయుడు 2’ సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయటానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల్లో గొప్ప ఆలోచన రేకెత్తించేలా సినిమాలు చేస్తూ తన అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జులై 12న ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!