Amrapali Kata: ఐఏఎస్ అధికారులంతా కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కూకట్ పల్లి, జేఎన్టీయు, మూసపేట్, భరత్ నగర్ లో రైతు బజార్ ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. చెత్తను తొలగించాలని తెలిపారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
Read also: Bhanuprakash Reddy: అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకెళతాం: భానుప్రకాష్ రెడ్డి
ఖైరతాబాద్, ఎల్ బి నగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై జోనల్ కమిషనర్ లు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ నెల 6న జరిగే జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశానికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. తన ఛాంబర్‌లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ (4న) స్టాండింగ్ కమిటీ, 6న జరిగే సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సంబంధించి సమగ్ర వివరణ ఇచ్చేందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Gujarat : 141 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్.. యూనివర్సిటీ పరీక్షపై వివాదం