Chicken Price: మాసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మొన్నటి వరకు కాస్త దిగి వచ్చిన చికెన్ రేటు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
Heavy Flood Water: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది.
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం అందించింది. హైదరాబాద్లోని హయత్నగర్లో 600 చదరపు గజాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. కాగా.. ఆ ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగిలయ్యకు అందజేశారు. మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా ఉన్నారు. కాగా.. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు.
IT Raids: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్పోస్టు, మాదాపూర్లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
డాక్టర్ దివి మురళి... హైదరాబాద్లో అత్యంత ధనవంతుడు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం.. ఆయన నికర విలువ $7 బిలియన్లు (సుమారు రూ. 5847 కోట్లు). డాక్టర్ మురళీ.. ప్రసిద్ధ బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్.