Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..
- రేవంత్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ భేటీ..
- కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు (శనివారం) జరుగబోతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపైన మంత్రివర్గంలో చర్చించి, క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగులకు పెండింగ్ డీఏలపైనా కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Papikondalu Tour: పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
ఇక, గతంలో వివిధ శాఖలకు పంపించిన వీఆర్వోలు, వీఆర్ఏలతో ఈ పోస్టుల భర్తీకి నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మూసీ నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన రేవంత్ సర్కార్, తాజాగా ఓఆర్ఆర్ వెంట ఓపెన్ ప్లాట్స్ ఇవ్వాలని చూస్తుంది. మొత్తం 600 నుంచి-700 ఎకరాలను మూసి నిర్వాసితులకు కేటాయించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also: YVS Chowdary : అక్టోబర్ 30న తొలిసారి కనిపించనున్న ఎన్టీఆర్
అలాగే, రైతు భరోసా విధివిధానాలపై రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రైతు భరోసా గైడ్ లైన్స్ రూరూపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ నివేదికపైనా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ సమావేశాల తేదీలపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!