Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో జరిగింది. దీంతో షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. గాలిలో 20 నిమిషాల తిరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అందుకోసం.. టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. అక్కడి నుంచి నోవాటెల్, తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాధర స్వాగతం పలికారు.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
కల్తీ టీ పొడి తయారు చేసి దుకాణాలకు విక్రయిస్తున్న ముగ్గురు కల్తీ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ లోని ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ అనే వ్యక్తి కోణార్క్ టీ పౌడర్స్ సేల్స్ సప్లై పేరిట వ్యాపారం చేస్తున్నాడు. నాసిరకం టీ పొడిని కిలో రూ. 80 నుంచి 100కు కొనుగోలు చేస్తున్నాడు. ఆ పొడిలో కొబ్బరి పీచు, పంచదార పాకం, రసాయనాలు కలిపి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నాడు. దానిని కిలో రూ.…
ఓ క్యాబ్ డ్రైవర్ మహిళతో పులిహోర కలిపాడు. పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఆమె కాపురంలో నిప్పులు పోశాడు. ఆ డ్రైవర్ వికృత చేష్టల కారణంగా భార్యాభర్తలు ఎనిమిది సార్లు హైదరాబాద్-లండన్, లండన్-హైదరాబాద్ పరుగులు పెట్టారు. అసలు ఏం జరిగిందటే..
Murder In Hyderabad: బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్య జరిగింది. హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో కత్తులతో దాడి చేసి హత్య చేసాడు సిద్దిక్ అనే వ్యక్తి. విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా…
ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్‌లు బయటపడ్డాయి.
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో అత్త మామలను చంపేందుకు కుట్ర పన్నింది ఓ కోడలు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్ ను చేసే బురిడి బాబును ఆశ్రయించింది. బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలను చంపేందుకు తనను ఆశ్రయించిన మహిళను బురిడీ కొట్టించాడు నకిలీ బాబా మహమ్మద్ ఖలీద్.. నాజియా అనే మహిళ తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ తో చంపాలని కుట్ర పన్నింది. అయితే ఆమెనే మోసం చేసే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన…