హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామంతాపూర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ పై నుండి దూకి సూసైడ్ కు పాల్పడింది. అయితే.. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి హరితగా గుర్తించారు. ఆమె.. రామంతాపూర్లోని DSL మాల్లో ఉద్యోగం చేస్తుంది.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే.. నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ.., తీర్పు వాయిదా పడింది.
నగర పరిధిలోని చెరువల ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్కు చేరువలో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు.
క్యాబ్లో ఎక్కే జంటలతో ఎంత విసుగుపోయాడో.. ఏంటో తెలియదు గానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తన క్యాబ్లో శృంగారానికి చోటు లేదంటూ వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం… హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఈ ఆలయం ప్రముఖ, ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా, ఆషాడ మాసం వంటి పండుగలను ఈ ఆలయంలో అత్యంత భక్తితో నిర్వహిస్తారు. ఈ ఆలయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి ఎదురుగా ఉంది. ఫిల్మ్ నగర్ బస్ స్టాప్ నుండి నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. అనేక మంది ప్రఖ్యాతులైన వ్యక్తులు,…