Alleti Maheshwar Reddy : రేవంత్ లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పావు కదా ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా? అని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి. మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మీ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారు.. ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణను ఏటీఎం లాగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఆయన అన్నారు.
Fine For Post Office: యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు రూ. 15 వేలు జరిమానా
మీ కమీషన్లు, అక్రమ సంపాదన కోసం పేదల ఇండ్లను కూలిస్తే ఉరుకోబోమని, మాకు లండన్, సియోల్ అక్కర్లేదు.. మాకు మా హైదరాబాద్ లాగానే ఉంచండి చాలు అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ ఇస్తాంబుల్ లాగా మారుస్తామని చెప్పారని, ఇప్పుడు మీరు లండన్, సియోల్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ సర్కార్ కు పేదల భూములే కనిపిస్తున్నాయా? ఎంఐఎం నేతలవి కనిపించడం లేదా అని మహేశ్వర్ రెడ్డ ధ్వజమెత్తారు. పేదలవి కూల్చి.. ఎంఐఎం నేతలవి ఎందుకు కూల్చడం లేదని ఆయన అన్నారు. డీపీఆర్.. లేకుండా ఎలా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.. ఎలా కూలుస్తున్నారు? పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోబోమని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సీఎంపై తీవ్ర విమర్శలు