Kishan Reddy: ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ డివిజన్, ముషీరాబాద్ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ విషయంలో హైలేవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కావాల్సిన నిధులు మంజూరు చేసి నగరాన్ని రక్షించాలని సీఎం రేవంత్ ను కోరుతున్నాను.. దురదృష్టవశాత్తు గత కొన్నిరోజులుగా క్రాంటాక్టర్లకు బిల్లులు రావడం లేదు.. మంజూరు అయిన పనులకు టెండర్లను పిలిస్తే క్రాంటాక్లర్లు ముందుకు రావడం లేదు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.. చిన్నపాటి వర్షం పడితే డ్రైనేజీ వాటర్ ఇండ్లలోకి రావడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh : రైలును బోల్తా కొట్టించే కుట్ర.. ట్రాక్ పై రాళ్లు, చెట్ల కొమ్మలు
ఇక, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. లక్షా యాభై వేల కోట్లతో మూసీ నది బ్యూటిఫికేషన్ చేస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు.. హైదరాబాద్ కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమే కానీ.. పేదవాళ్ల ఇండ్లను తొలగించకూడదని డిమాండ్ చేశారు. బస్తీలల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయాలి.. ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి.. పారిశ్రామిక రంగం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్, హెల్త్ సెక్టార్, విద్యారంగాల్లో హైదరాబాద్ వేగవంతంగా ముందుకెళ్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.