గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నాయని.. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలయాపనకు ఫుల్స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని సీఎం వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్ లోని థేమ్స్ నది, సియోల్ లోని చియోంగ్ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది. మరి దీనిపై వివాదం ఎందుకు..? మూసీ నది చరిత్రేంటి..? ఎందుకిలా తయారైంది..? తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని…
మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తైంది.
హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు.
యువకులకు చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వారి ప్రవర్తన వల్ల సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకునేందుకు యత్నిస్తే ప్రాణం తీసేందుకు కూడా వెనకాడటం లేదు.
KTR Viral Tweet: రాష్ట్రానికి పైసా లేదు, లాభం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని..
IT Rides: హైదరాబాద్‌లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.