హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూశారు. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు.ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి…
CM Revanth Reddy : గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో…
Kondapochamma Sagar : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండపోచమ్మ సాగర్‌కు పర్యటనకు వెళ్లారు. అందులో కొందరు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆ యువకులు డ్యామ్‌లోకి పడిపోయారు. అక్కడున్న స్థానికులు వారిని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.. అయితే… మిగిలిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే.. తాజాగా…
CM Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ పట్టణ పరిధిలోని ప్రధాన బస్ స్టాప్ల దగ్గర జనం బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి , కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు.
దానం నాగేందర్... గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటని చెప్పుకుంటారు. పార్టీలు, లాయల్టీలు జాన్తానై.. పని జరగడమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎథిక్స్, యాలక్కాయలు తర్వాత సంగతి.... ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్రా భై... అంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం అట. అందుకు తగ్గట్టే... తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి...…