Telangana Jagruthi: నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం.. సాగునీటి ప్రాజెక్టులపై కీలక చర్చ!
- నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం..
- సాగునీటి ప్రాజెక్టులపై ఉ. 11గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం..
- నీళ్లు-నిజాలు పేరుతో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశం..
- జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Jagruthi: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాలపై కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు (జనవరి 31) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు పాల్గొననున్నారు.
Read Also: Health Tip: వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Also Read
అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు కేసీఆర్ నిర్మించిన కీలక ప్రాజెక్టులపై అసత్య ప్రచారం చేస్తుంది.. కాబట్టి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి పేర్కొనింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని వెల్లడించారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. ఇక, అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదించనున్నారని చెప్పుకొచ్చారు.
Read Also: Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
ఇక, కేసీఆర్ ప్రారంభించారనే కోపంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా ఆపేసింది అని తెలంగాణ జాగృతి ఆరోపించింది. సీతారామ ఎత్తిపోతలను ప్రచార ఆర్భాటం కోసం అధికారికంగా ప్రారంభించిన ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల టెండర్ల విషయంలోనూ ఈ సర్కార్ కి క్లారిటీ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని పెండింగ్ పనులు చేయడం లేదు.. అలాగే, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని పేర్కొంది. ఈ అన్ని అంశాలను ప్రజలకు తెలియజేడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!