ఫేస్ బుక్ బ్రౌజింగ్ లో వాట్సప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారు.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రూ. 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు అని ఆయన తెలిపారు. మరో బాధితుడు విడతల వారికి రూ. 2.06 డబ్బును కోల్పోయాడు. అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు.. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారు అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
విద్యను ఎవరు దోచుకోలేరు, విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పని చేయడం అభినందనీయం అని చెప్పుకొచ్చారు. మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఈరోజు (జనవరి 29) ఉదయం గంట పాటు ఆగిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో నాగోల్ టూ రాయదుర్గం రూట్ బ్లూ లైన్ లో అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, పెద్దమ్మ టెంపుల్ రూట్లో టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు ఆగిపోయింది.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు (జనవరి 29) కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కసరత్తు చేస్తున్నారు. నేటి ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ తదితరులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచారం ముఠా గుట్టు రట్టు అయింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలో గల గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్మెంట్లో ఎస్ఓటి పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఈ దాడుల్లో విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
Chakwadi Nala Break: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహాల్ పరిధిలోని చాక్వాడి వద్ద మరోసారి నాలా రోడ్డు కుంగిపోయింది. ఈ నాలా ఇప్పటికే నాలుగు సార్లు కుంగిపోగా.. మంగళవారం రాత్రి మరోసారి కుంగింది.
తెలుగు రాష్ట్రాల్లో మీర్పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు.
దావోస్లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు.