సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో.. రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్ళాలని.. 17న విచారణకు హాజరవుతాన్న కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్ లో ప్రేమ వ్యవహారం, పసి పాపకు శాపంగా మారింది. గోపాల నగర్ లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన యువతి స్వాతి ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడు. పలు మార్లు యువతి బంధువులు హెచ్చరించారు. ప్రదీప్ తన శైలి లో మార్పు రాకపోగా.. స్వాతికి, పువ్వులు పంపడంతో స్వాతి బాబాయ్ వివేక్నంద ఆగ్రహానికి గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.
నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా…
నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైన జంట కేసులో ట్విస్ట్ నెలకొంది. నార్సింగి పోలీస్ స్టేషన్ డబుల్ మర్డర్ కేసులో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.
సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది సొంతుళ్లకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా.. కొందరు మాత్రం పనులు, వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్లలేకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి.
HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది.…