హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం.
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు.
హైదరాబాద్ చింతల్‌బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కూల్చివేతలను దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు.
Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్తో పాటు మరికొంత మంది…
హైదరాబాద్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్.. అతని వద్ద నుంచి బెంజ్ కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు దృష్టి మళ్లించి ఏటీఎం కార్డులు దొంగిలించి నగదు దోచుకుంటున్న ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, రూ.7.6 లక్షల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డను స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. అమీన్ పూర్లో 193 సర్వే నంబర్లోని తమ ల్యాండ్ కబ్జాకు గురైందని ఓ మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి తమ ల్యాండ్ కబ్జా చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానని సదరు మహిళ చెప్పారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి…