Constable Suicide: షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం..కానిస్టేబుల్ సూసైడ్!
- షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో కానిస్టేబుల్ సూసైడ్..
- మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్..
- షేర్ మార్కెట్లో నష్టం రావడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం రావడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కానిస్టేబుల్ వెంకటేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా.. కాగా, అతడికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
Read Also: TDP Politburo: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
Also Read
అయితే, 2024లో ఆంధ్రాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పని చేస్తున్న భాస్కర్ బాబు స్నేహితులను నమ్మి షేర్ మార్కెట్, ఆన్ లైన్ బిజినెస్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిన భాస్కర్ లోన్ యాప్లు, బ్యాంకులు, సన్నిహితుల దగ్గర అప్పు చేసి మరీ రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. కొంతకాలం పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చిన స్నేహితులు 2024 ఏప్రిల్ నుంచి ఎలాంటి లాభం, అసలు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, లోన్ యాప్లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క ఈఎంఐల టెన్షన్, మరో పక్క అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో.. ఆ బాధలు భరించలేక డిసెంబర్ 22, 2024న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?