Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా మొత్తం ఏడు సెక్షన్ల కింద వల్లభనేనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ వ్యవహారంలోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.. సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.. వంశీపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పడమట పోలీసులు.. పడమట పీఎస్‌లో 86/ 2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. బీఎంఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ త్రి బై 5 సెక్షన్ల కింద.. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 సెక్షన్ 5ల కింద కేసు నమోదు చేశారు..
Read Also: Himayatnagar Robbery: హిమాయత్ నగర్‌లో భారీ చోరీ.. రెండు కోట్ల రూపాయల నగలు మాయం!
అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ నుంచి తనకు ఫిర్యాదుతో సంబంధం లేదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించిన వల్లభనేని వంశీ.. సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు దొరికిపోయాడని చెబుతున్నారు.. దీంతో సత్యవర్ధన్ విత్‌డ్రా పిటిషన్ వెనుక కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. సత్యవర్ధన్‌లో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన జోరు.. స్పాట్‌లో వంశీ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. వంశీ కోర్టు దగ్గరకు వెళ్లిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.. అంతేకాదు.. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించడంతో పాటు.. సత్యవర్ధన్‌కు రూ.10 లక్షల రూపాయాలు ఇచ్చారట వంవీ.. కోర్టులోపటికి సత్యవర్ధన్ ని పంపించి స్టేట్మెంట్ స్వయంగా విత్ డ్రా చేయించారు.. ఇక, పిటిషన్ వేసిన వెంటనే బయటికి వచ్చి వంశీని కలిశాడట సత్యవర్ధన్.. ఆ తర్వాత సత్యని విశాఖకు పంపించిన వంశీ.. తాను నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు..
Read Also: KA 10 : ‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.?
ఇక, ఆ తర్వాత తన కొడుకు కనిపించట్లేదు అంటూ పోలీసులను ఆశ్రయించారు సత్యవర్ధన్ తల్లి.. సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పడమట పోలీసుల కేసు నమోదు చేసి రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చేసింది.. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు సంబంధించి కేసు నమోదు చేశారు.. కోర్టు దగ్గరికి స్వయంగా వల్లభనేని వంశీ వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు.. ఆ తర్వాత హైదరాబాద్‌లో రాయదుర్గం పోలీసుల సహకారంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.. మరోవైపు, వైజాగ్ లో సత్యవర్ధన్ అదుపులోకి తీసుకొని విజయవాడ తరలిస్తున్నారు.. సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదుపై పడమటలో కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీపై కిడ్నాప్, బెదిరింపులు కేసులు పెట్టారు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఐదుగురు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు పటమట పోలీసులు..