గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నానాక్ రామ్ గూడ వద్ద 41 గ్రాముల బ్రౌన్ హెరాయిన్‌ను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ నగరంకు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ టీమ్ గుర్తించింది.
Also Read: Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు!
ఇటీ క్యారిడార్ అడ్డగా విద్యార్దులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కేటుగాళ్లు హెరాయిన్ విక్రయిస్తున్నారు. బ్రౌన్ హెరాయిన్ విక్రయిస్తుండగా.. శంషాబాద్ డీటీఎఫ్ టీమ్ కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో వీరికి ఎవరు సహకరిస్తున్నారు?, ఈ డ్రగ్స్ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే కోణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు.