Pawan Kalyan South Indian Temples Tour: ఇవాళ్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. అంటే.. ఇవాళ్టి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ముందే ఫిక్స్ చేసినా.. జ్వరం కారణంగా పవన్ పర్యటన వాయిదా పడింది… అయితే, జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, మూడు రోజుల పాటు దక్షిణాదిలోని పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళుతున్నారు. ఇందులో, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంకల్పించిన విషయం విదితమే..