Home
Huzurabad By Election
Huzurabad By Election News
-
హుజురాబాద్ అప్డేట్: 19 మంది నామినేషన్ల తిరస్కరణ
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో…ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయ్. ఇంటింటికి వెళ్లి…ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆసక్తికర విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో 19 నామినేషన్లు తిరస్కరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. ఈటల పేర్లతో ఉన్న ముగ్గురి నామినేషన్లు తిరస్కరించారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేర్లతో… మొత్తం నలుగురు అభ్యర్థులు… -
టీఆర్ఎస్, బీజేపీలను హడలెత్తిస్తున్న సింబల్స్…?
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయవేడిని రగిలించింది. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారింది. దీంతో ఇక్కడ గెలుపు ఇరువురికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకొని హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు మాత్రం ఎన్నికల గుర్తులు(సింబల్స్) టెన్షన్ కు గురిచేస్తున్నాయట… హుజూరాబాద్… -
ఈటల తన స్వార్థం కోసమే బీజేపీ పార్టీలో చేరాడు : హరీష్ రావు
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయ్ ఒక్కసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడు చెప్పాలి అన్నారు. మీకు పని చేసే వాళ్ళను గెలిపించండి. ఈటల లేనిపోని మాటలు… -
హుజూరాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ..?
హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం మొదలైంది. ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్ హోరా హోరీ తలపడుతున్న ఈ పోరులో ఓటరు ఎటువైపు? నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు అధికార పార్టీ గెలుపు మంత్రంగా ప్రభుత్వ పథకాలను ఓటరు చెంతకు తీసుకుపోతోంది. మరోవైపు, దగాపడ్డ తెలంగాణ బిడ్డలా ..ఆత్మగౌరవం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మరి ఈటల వైపు సానుభూతి పవనాలు… -
మీ భరతం పట్టే రోజు దగ్గర్లో ఉంది : ఈటల
కమలాపూర్ మండలం లోని శ్రీరాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ మాట్లాడితే ఒకనాడు తెలంగాణ పులకించింది. అడుగులో అడుగు వేసింది. ఈ రోజు ఎవరు ఎక్కువ ఆయన్ను తిడితే అంత ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అంటే అయన పెరిగినట్ట, తరిగినట్టా? అయన చరిత్ర హీనం అవుతుంది. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి కత్తి అందిస్తే హరీష్ వచ్చి పొడుస్తుండు. కాళోజీ చెప్పినట్టు ప్రాంతం… -
బద్వేల్ లో ఏకపక్షం.. హుజూరాబాద్ లో ఉత్కంఠ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో జిల్లాలోనూ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమేననే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలోని హుజూరాబాద్ లో ఐదు… -
హుజురాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష…
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఐ.జి. నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ పాల్గొన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.… -
కేవలం మీ ఓట్ల కోసమే హామీలు : ఈటల
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివాని పల్లిలో మంత్రి నేడు ఈటల ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఓట్ల కోసం ఏది అడిగితే అది ఇస్తారట. నామీద దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ల నియోజకవర్గాలను పట్టించుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. కూట్లే తీయలేనోడు.. ఏట్లో రాయి తీసినట్లుగా ఇక్కడ హామీలిస్తున్నారు. దళితబంధు సహా.. అనేక హామీలు ఇస్తున్నారంటే అవన్నీ మీపై ప్రేమతో… -
కార్యకర్తల బలం మీదే మా నమ్మకం…
హుజూరాబాద్ ఎన్నికల వ్యూహం పై చర్చ చేశాం. మండలంకి ఓ ఇంచార్జీ, వారీతో పాటు నలుగురు నాయకులు అలాగే గ్రామానికి ఓ ఇంఛార్జి నియామకం చేస్తున్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. హుజూరాబాద్ లో కార్యకర్తల బలం మీదే మా నమ్మకం అని చూపిన ఆయన వందల కోట్లు దండుకుంటున్నారు తెరాస కి ఓటు వేస్తారా… లేదా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ కి ఓటు వేయాలో ఆలోచిస్తున్నారు… -
బతుకమ్మ పాటల్లో ఎన్నికల వేడి…
కొంత కాలంగా తెలంగాణ రాజకీయం ఇప్పుడు హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. ఉప ఎన్నిక సమయం సమీపిస్తోంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రచారం కూడా రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఏ ఒక్క ఓటరునూ నిర్లక్ష్యం చేయరాదని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. అంది వచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బతుకమ్మ వేడుకలనూ వదలట్లేదు పార్టీలు. బతుకమ్మ పాటల్లో ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. దొంగ బీజేపీ ఉయ్యాలో.. గ్యాస్ ధరలను పెంచి…
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!