పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఐ.జి. నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ పాల్గొన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ అన్నారు. ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఐ.జీ. నాగిరెడ్డి, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, నోడల్ ఆఫీసర్లతో ఎన్నికల నిర్వాహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 న జరుగనున్న హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాలలో లైటింగ్, విద్యుత్, ర్యాంపులు, త్రాగునీటి వసతి, షామియనాలు, వీలు చైర్లు మొదలగు అన్ని సౌకర్యాలు ఉండేలా ముందుగానే తనిఖీ చేసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు.
పోలిగ్ కెంద్రాలు అన్ని గ్రౌండ్ ఫోర్ లోనే ఉండేలా చూడాలని అన్నారు. పోలింగ్ రోజున కోవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు సానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ ఓటింగ్ లో పాల్గొనేలా చూడాలని అన్నారు. పోలింగ్ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కు 72 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని అన్నారు. ఇన్ డోర్ లో 200 మందికి మించకుండా బహిరంగ ప్రదేశాలలో 1,000 మందికి మించకుండా సభలు నిర్వహించుకోవాలని అన్నారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో 5 గురు మాత్రమే ఉండాలని అన్నారు.
ఇక ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నికల సిబ్బందికి ఈ.వి.ఎం.ల పనితీరు పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది అందరూ రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని ఉండాలని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల నిర్వాహణ సందర్భంగా విజిలెన్స్ టీముల ద్వారా అక్రమ మద్యం, డబ్బు రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. పోలింగ్ కు ముందు ఓటర్లందరికి పోలింగ్ స్లిప్ లను పంపిణీ చేయాలని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలను శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా ఎన్నికలు జరిగేలా తగిన చర్యలు గైకొనాలని సూచించారు.
దీని పై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ… హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయని, ఓటర్ల జాబితా సిద్ధం చేశాము. ఉప ఎన్నికకు సంబంధించి 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌళిక సౌకర్యాలను కల్పించాము. ఉప ఎన్నికలు స్వేచ్చగా శాంతియుతంగా జరిగెందుకు ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., వి.ఎస్.టి. వి.వి.టి., ఎం.సి.సి., టీములను నియమించి పర్యవేక్షిస్తూన్నాము. హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వాహణకు 428 ప్రిసైడింగ్ అధికారులు, 428 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 858 ఓ.పి.వో. లను, 30 సెక్టోరల్ అధికారులను నియమించాము. హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పి.జి. కళాశాలలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసారు.
పోలీస్ కమీషనర్ వి. సత్య నారాయణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక శాంతియుతంగా జరిగెందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, ఓటర్లను ప్రలోబపెట్టకుండా ఉండెందుకు కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయి. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహానాల తనిఖీ చేస్తున్నాము. నగదు, మద్యం లాంటి వాటిని పట్టుకొని కేసులు నమోదు చేసారు.