Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Focus On Telugu States By Elections

బద్వేల్ లో ఏకపక్షం.. హుజూరాబాద్ లో ఉత్కంఠ?

Published Date :October 9, 2021 , 9:34 pm
By Manohar
బద్వేల్ లో ఏకపక్షం.. హుజూరాబాద్ లో ఉత్కంఠ?
  • Follow Us :

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో జిల్లాలోనూ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమేననే టాక్ విన్పిస్తోంది.

తెలంగాణలోని హుజూరాబాద్ లో ఐదు నెలల ముందు నుంచే ఎన్నికల వేడిరాజుకుంది. ఈ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటల ఈసారి బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ మాత్రం వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమనే సంకేతాన్ని ఇచ్చేందుకు సిద్ధవుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారు అనేది ఆసక్తిని రేపుతోంది.

హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గతంలో చేసిన అభివృద్ధి, సానుభూతి పవనాలు ఆయనకు కలిసి రానున్నాయి. అయితే ఆయన వెంట ఉండే నాయకులు క్రమంగా టీఆర్ఎస్ లోకి వెళుతుండటం ఆయనకు మైసస్ గా మారుతోంది. ఇదే సమయంలో ఈటలకు బీజేపీ పెద్దల నుంచి సహకారం లభిస్తుండటంతో ఆయన ఎలాగోలా ఈ ఎన్నికల్లో గట్టెక్కుతారనే టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతోపాటు స్థానిక నేతలు రంగంలోకి దిగి హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ మరో రెండేళ్లు అధికారంలో ఉండటం ఆపార్టీకి కలిసి రానుంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాలను తమ అభ్యర్థిని గెలిపిస్తాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. ఆయనకు తోడుగా మంత్రులు గుంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లో వీరంతా పని చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

హుజూరాబాద్ కాంగ్రెస్ పోటీలో ఉన్నా నామమాత్రంగానే కన్పిస్తుంది. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యేనని స్పష్టమవుతోంది. నిన్నటితో నామినేషన్లు ముగియగా మొత్తంగా 61మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 11 నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటికి మరికొంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఏదిఏమైనా హుజూరాబాద్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బద్వేల్లో మాత్రం వైసీపీ గెలుపు ఏకపక్షంగా కన్పిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కడప జిల్లాను వైసీపీ క్వీన్ స్లీప్ చేసింది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సొంత జిల్లాలోనే ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. వైసీపీకి అంతో ఇంతో పోటీ ఇచ్చే టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆపార్టీకి గెలుపు మరింత ఈజీగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ లు పోటీలో ఉన్నా వాటికి గెలిచే సత్తా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైసీపీ గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆపార్టీ కేవలం మెజార్టీపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్లు ముగిసే నాటికి బద్వేల్ లో 35మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉప సంహరణకు ఇంకా సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. మొత్తానికి హుజూరాబాద్లో ఉత్కంఠ పోరు నడవనుండగా బద్వేల్ లో మాత్రం చప్పగా సాగే అవకాశం కన్పిస్తుంది. దీంతో అందరిచూపు హుజూరాబాద్ ఉప ఎన్నిక రిజల్ట్ పైనే పడుతోంది.

  • Tags
  • Andhra Pradesh
  • Badvel By Election
  • Huzurabad by-election
  • telangana
  • telugu states by-elections

WEB STORIES

కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

"కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.."

Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?

"Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?"

చికెన్ తినడం వల్ల గర్భిణులకు బోలెడు లాభాలు..

"చికెన్ తినడం వల్ల గర్భిణులకు బోలెడు లాభాలు.."

Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

"Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?"

ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..

"ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి.."

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే..

"ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే.."

2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే..

"2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే.."

భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!

"భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!"

ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే..

"ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే.."

Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు

"Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు"

RELATED ARTICLES

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Top Headlines @9PM: టాప్ న్యూస్

Off The Record: అక్కడ మహేష్ వర్సెస్ సంజయ్

Off The Record: వాళ్ళిద్దరూ కలిసి నడుస్తారా?

Top Headlines @5PM: టాప్ న్యూస్

తాజావార్తలు

  • Jamiat Ulama I Hind : స్వలింగ పెళ్లిళ్లు భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం

  • Gadwal Vijayalakshmi: రాత్రి వేళల్లో వీధికుక్కల సంచారం.. బరిలో ప్రత్యేక టీం

  • Atrocious News: దారుణం.. అర్ధరాత్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తగలబెట్టేశారు..

  • America : టోర్నడోలో విధ్వంసం.. 18 మంది మృతి..

  • Astrology: ఏప్రిల్‌ 2, ఆదివారం దినఫలాలు

ట్రెండింగ్‌

  • YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

  • Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions