తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్లోని బన్స్వారాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే.. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
కట్టుకున్న భార్యపై అనుమానంతో కడతేర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా మరోసారి ఆ విషయంపై వాగ్వాదం నెలకొనగా.. ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి.
కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని,…
యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మేడ్చల్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను గొలుసులతో బంధించి భార్య చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ (50), భారతి (45) అంబేద్కర్ నగర్ నివాసితులు. రెండు అపార్ట్మెంట్ల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. కృష్ణ తన భార్య నుండి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భారతి భార్య మూడు రోజుల…
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్పై ఉన్న…