ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పూణే నగరంలోని కిడ్నాప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై పూణే మహానగరంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తో పాటు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పట్టపగలే ఇంత దారుణం జరుగుతున్న గాని.. మహిళని కారులో ఎక్కించే సమయంలో…
భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు.…
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో హృదయ విదారకమైన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటో రిక్షాలో డంప్‌యార్డుకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టాడు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్‌లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Maharastra : మహారాష్ట్రలోని తుల్జాపూర్లో భర్తకు మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది భార్య. బాధిత భర్త తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుటుంబం మొత్తానికి అతని భార్య ఇలా చేసింది.
తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని బన్స్వారాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే.. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
కట్టుకున్న భార్యపై అనుమానంతో కడతేర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా మరోసారి ఆ విషయంపై వాగ్వాదం నెలకొనగా.. ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.