యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
Ayurvedic Drink: ఈ ఆయుర్వేద పానీయంతో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులకు చెక్..
వివరాల్లోకి వెళ్తే.. మోహిని అనే వివాహిత దాదాపు 10 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్లింది. వారిద్దరు పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. అయితే.. మూడేళ్ల క్రితం వీరి మధ్య గొడవలు దూరాయి. ఈ క్రమంలో భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో.. ఆ మహిళ తన కన్నవారింటికి వచ్చి ఉంటుంది. కూలి పని చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. అయితే.. ఆమె శనివారం నోయిడా వెళుతున్నానని చెప్పి తన ఇద్దరు కుమారులు 5 ఏళ్ల గౌతమ్, 3 ఏళ్ల హర్ష్‌తో కలిసి ముస్కరా పట్టణానికి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎవరు లేని ప్రాంతానికి చేరుకున్న వివాహిత మోహిని.. అక్కడ పిల్లలిద్దరికీ విషం ఇచ్చి తానూ తాగింది. అయితే.. కొద్దిసేపటికే ముగ్గురి పరిస్థితి విషమించింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చేలోపే మోహిని, గౌతమ్ చనిపోయారు. చిన్న కుమారుడు హర్ష్‌ను సిహెచ్‌సికి తరలించారు. అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయగా.. తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పిల్లవాడు కూడా మరణించాడు.
Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
చనిపోయే ముందు మృతురాలు నోయిడాలో నివసిస్తున్న తన స్నేహితురాలికి ఫోన్ చేసిం మాట్లాడింది. పిల్లలిద్దరితో పాటు తాను కూడా విషం సేవించినట్లు తన తల్లికి చెప్పాలని కోరింది. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు ముస్కారాకు చేరుకున్నారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. దీంతో.. కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరుమున్నీయ్యారు. మోహిని తల్లి రాజకుమారి మాట్లాడుతూ.. మోహిని 10 సంవత్సరాల క్రితం తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పింది. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఇద్దరూ విడివిడిగా జీవించేవారని తెలిపింది. ఈ క్రమంలో.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తల్లి తెలిపింది.