BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- ఆగస్ట్ 7న మైనర్‌పై భార్గవ్ అత్యాచారం
- బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం
- భార్గవ్, అతడిని ప్రోత్సహించిన బాలిక తల్లిపై పోక్సో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య కు దూరంగా ఉంటున్న ఓ వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ మహిళ కూతురు మీద కూడా కన్నేశాడు ఈ కామంధుడు.. చిన్న పిల్లా వద్దు అని చెప్పి అడ్డు కోవాల్సిన ఆ తల్లి కూడా ప్రోత్సహించింది. దీంతో ఆ మృగాడు బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఐతే బాలిక ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఆ కసాయి తల్లి ఎవరు? ఓ వైపు తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్గవ్.. మహిళ కూతురుపైనా కన్నేశాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యా యత్నం చేసింది. బాత్రూమ్ క్లీనింగ్‌కు వాడే కెమికల్ లిక్విడ్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
అనకాపల్లికి చెందిన ఓ వివాహిత తన భర్తతో తలెత్తిన విభేదాలతో ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తెతో కలిసి వేరుగా ఉంటోంది. స్థానిక చేపల మార్కెట్ వద్దనున్న సచివాలయంలో పనిచేస్తున్న భార్గవ్ ప్రకాశ్ గతంలో భార్యతో గొడవపడి ప్రస్తుతం శారదానగర్‌లో ఉంటున్నాడు. బాలిక తల్లికి, అతడికి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అతడి కన్ను బాలికపై పడింది. ఈ విషయం తెలిసీ.. బాలిక తల్లి అతడిని అడ్డు చెప్పకుండా ప్రోత్సహించింది. ఆగస్ట్ 7న భార్గవ్ అత్యాచారానికి పాల్పడగా.. అదే రోజు బాలిక బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలికను తల్లి చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పోలీసుల విచారణలో బాధితురాలు జరిగిందంతా చెప్పింది. అత్యాచారానికి పాల్పడిన భార్గవ్, అతడిని ప్రోత్సహించిన బాలిక తల్లిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తల్లితో వివాహేతర బంధం పెట్టుకుని కూతురుపై కన్నేసి అత్యాచారం చేసిన మృగాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?