భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భార్య.. ఒకే భర్త అన్న సాంప్రదాయం ఉంది. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక చచ్చేంత వరకు కలిసి ఉండాలి. ఇదే పద్ధతి దేశంలో కొనసాగుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ బంధానికి విలువ లేకుండా పోయింది.
సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, పిల్లలు కూడా తనకి పుట్టలేదన్న అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య శ్రీలత(35) ని కత్తితో పొడిచి చంపిన భర్త ఎల్లయ్య.. అనంతరం కూతురు(15), కొడుకు(12)పై కత్తితో దాడికి యత్నించాడు. తండ్రి దాడిలో తప్పించుకుని పారిపోయిన కుమారుడు. అనంతరం గడ్డి మందు తాగి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు…
AP Crime: కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో జరిగిన ఓ హత్య కేసు తొమ్మిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను హత్య చేసిన భర్త, సహజ మరణంగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను మోసం చేసిన దారుణ ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోరంకికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి (46) దంపతులు. వీరికి కుమారుడు నగేష్, కుమార్తె తేజశ్రీ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుండగా,…
మంచి నీళ్లు తాగినంత ఈజీగా విడాకులు కోరుతున్నారు కొందరు భార్యలు. వింతైన కారణాలు చెబుతూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భార్యాభర్తల మధ్య ఒక వింత కేసు వెలుగుచూసింది. తన భార్యను సబ్-ఇన్‌స్పెక్టర్‌గా చేయడానికి భర్త అవిశ్రాంతంగా కృషి చేశాడు. అయితే, ఆమె ఎస్ఐ అయిన వెంటనే, భర్త వేషధారణ, అతడు చేసే వృత్తిని చూసి భార్య ఇబ్బంది పడటం ప్రారంభించింది. Also Read:Pakistan Army Terror Links: ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ…
వరంగల్ చౌరస్తాలో వివాహిత కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నించింది. భార్య నుండి తప్పించుకునేందుకు జ్యువలరీ షాపులోభర్త దాక్కున్నాడు. వెంటనే డయల్100 కి ఫోన్ చేశాడు భర్త. అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళ చేతిలోని కత్తిని పోలీసులు లాక్కున్నారు. తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది వివాహిత జ్యోత్స్న. Also Read:Mahindra-Tata- M Evs: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ vs టాటా నెక్సాన్…
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య…
విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త రెచ్చిపోయాడు.. భార్య, అత్తపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. పెందుర్తి దగ్గువాని పాలెం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మీపై సుత్తితో తలపై కొట్టి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు అప్పారావు. ఇంట్లో అరుపులు కేకలు విని అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు అప్పారావు.. తీవ్ర గాయాలైన కనకమహాలక్ష్మి, లక్ష్మీలను పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి స్థానికులు తరలించారు. విషయం…
కారణాలు ఏవైనా సరే భర్తలను కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొందరు కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు తీస్తున్నారు. కాగా ఈనెల 12న వ్యక్తి బోడుప్పల్ లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు భార్యపై…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం రేపిన ఆత్మహత్య కేసులో లోతైన దర్యాప్తులో నిజాలు బయటపెట్టారు పోలీసులు. ప్రియుడు, స్నేహితులతో కలిసి భార్య హత్యకు కుట్రపన్నిందని వెల్లడించారు. భర్తను గొంతు నులిమి హతమార్చినట్లు తెలిపారు. వెంగళరావు కాలనీలో ధరవత్ హరినాథ్ (39) హత్య కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై దాడి చేసి గొంతు నులిమి హతమార్చారు నిందితులు. తర్వాత ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. భార్య దరావత్ శ్రుతిలయ ప్రధాన…
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో…