Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీడియో గేమ్స్ ఆడేవారిని ఆకర్షిస్తూ చేపట్టిన ప్రత్యేక ప్రచారం ద్వారా అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా 2,000 మందికి పైగా కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు. ఈ రిక్రూట్మెంట్ ప్రచారంతో ఎంతో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. సంస్థ అనుకున్న లక్ష్యంలో ఇప్పటికే 94 శాతం నియామకాలు పూర్తయ్యాయని, మరో 2,000 మందికి పైగా అభ్యర్థులు తర్వాతి దశల్లో ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత వల్ల విమానాలు ఆలస్యం కావడం, రద్దవ్వడం, సిబ్బందిపై పనిభారం పెరగడంతో, ఈ సమస్యను తీర్చడానికి యువతను ఆకట్టుకునేలా ఈ ప్రచారం తీర్చిదిద్దారు.
వీడియో గేమ్స్ ఆడటం వల్ల ఒకేసారి వేర్వేరు పనులు చేయడం, సమయానుకూలంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను వెంటనే పరిష్కరించడం వంటి నైపుణ్యాలు పెరుగుతాయని, ఇవి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగానికి చాలా ఉపయోగపడతాయని ఎఫ్ఏఏ భావిస్తోంది. అయితే, కేవలం ఆటలు ఆడటం మాత్రమే ఈ ఉద్యోగానికి సరిపోదు. దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా అమెరికా పౌరులై ఉండాలి, 31 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉండి, ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలగాలి. వీటితో పాటు ప్రత్యేక నైపుణ్య పరీక్ష, ఆరోగ్య, భద్రతా తనిఖీలలో నెగ్గాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఆక్లహామాలోని ఎఫ్ఏఏ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ఈ ఉద్యోగానికి నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ అవసరం లేకపోయినా, మంచి జీతం పొందే అవకాశం ఉంటుంది. 2024 లెక్కల ప్రకారం వీరి సగటు ఏడాది జీతం దాదాపు $144,580 (సుమారు రూ. 1.38 కోట్లు) వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసిన ఏజెన్సీ, అభ్యర్థులను శిక్షణలోకి తీసుకునే సమయాన్ని చాలావరకు తగ్గించింది. ఈ ప్రచారంపై నెట్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, సిబ్బంది కొరతను తీర్చడంలో ఈ ఆలోచన బాగా పనిచేసిందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?