బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు.
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని…
MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ…
ఆపరేషన్ కర్రిగుట్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..చతిస్గడ్ తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ..కర్రెగుట్టలే టార్గెట్గా భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి.. వేలమంది భద్రత బలగాలు ఇప్పుడు కర్రే గుట్టల వైపు దూసుకొనికుని వెళ్తున్నాయి.. ఏ క్షణం లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది.. అంతేకాకుండా వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రిగుట్టలో భారీ ఆపరేషన్ జరుగుతుంది.. హత్యకాండను వెంటనే ఆపాలని పౌరసంగాలు డిమాండ్ చేస్తున్నాయి.. ఈమెరకు పౌర సంఘాలు ఏకంగా సమావేశం…
KTR : లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. “బీఆర్ఎస్ లాంటి పార్టీ…
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత…
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది.
China: చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుని దేశ ఉన్నత అధికారులు నుండి కఠినమైన హెచ్చరికలు అందుకుంది. ఈ కంపెనీ రాబోయే సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించగా.. దానితో ఆ విషయం కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కంపెనీ ఒక వివాదాస్పద విధానాన్ని (policy) ప్రవేశపెట్టింది. 28 నుండి 58 సంవత్సరాల వయస్సు ఉన్న అవివాహితులు, విడాకులు పొందిన…