బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను జప్తు చేయాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటంలో భారతదేశం బహిరంగంగా మద్దతు ఇవ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.
READ MORE: MP: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కొడుకు.. భయాందోళనతో తండ్రి మృతి
ఈ లేఖను మీర్ యార్ బలోచ్ 1998 మే 28న బలూచిస్థాన్ లోని చాగైలో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలతో ప్రారంభించారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ సహకారంతో పాకిస్థాన్ సైన్యం బలూచ్ భూమిని నాశనం చేసిందని రాసుకొచ్చారు. ఈ పేలుళ్ల కారణంగా.. చాగై, రాస్ కో కొండలలో పేలుడు పదార్థాల వాసన ఇప్పటికీ అలాగే ఉందన్నారు. ఈ పరీక్ష కారణంగా అనేక పొలాలు నాశనమయ్యాయని, పశువులు చనిపోయాయని, పిల్లలు వికలాంగులుగా జన్మించారని పేర్కొన్నారు.
READ MORE: Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
అలాగే.. ఆ లేఖలో బలూచ్ నాయకుడు పాకిస్థాన్ ఆర్మీ.. ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలకు సపోర్టు చేస్తుందని బహిరంగంగా నిందించారు. ఐఎస్ఐ ప్రతి నెలా ఓ కొత్త ఉగ్రవాద సంస్థను సృష్టిస్తుందని, వారిని భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్థాన్, అమెరికా, ఇజ్రాయెల్‌లపై దాడుల కోసం ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ బలూచిస్థాన్‌లోని బంగారం, రాగి, గ్యాస్, చమురు, యురేనియంను దోచుకుంటుందన్నారు. వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నడుపుతోందని విమర్శించారు. ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఆ లేఖలో చైనా గురించి కూడా ప్రస్తావించారు. చైనా పాకిస్థాన్ సైన్యానికి మద్దతు ఇస్తోందని వివరించారు. తాము భారతదేశానికి మద్దతు ఇచ్చాము. ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే న్యూఢిల్లీలో బలూచిస్థాన్ రాయబార కార్యాలయాన్ని నిర్మించుకునేందకు అవకాశం కల్పించాలని లేఖలో రాసుకొచ్చారు.