కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత కుటమి ప్రభుత్వానిదన్నారు.
READ MORE: Priyadarshi : ఆ సినిమా చేయడం చెత్త నిర్ణయం.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్
“ధర్మాసనం ఇంప్లీడ్ పిటిషన్ విచారణ చేసి 12 వారాల్లో నివేదిక అందించాలని సుప్రీం ఆదేశించింది. కొల్లేరు శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడింది. పర్యావరణాన్ని కాపాడుతూనే ప్రజలకు న్యాయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు సమస్యపై చిత్తశుద్ధి తో ఉన్నాయి. కొల్లేరు గ్రామాల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టాం. కొల్లేరు సమస్యపై ఎంపీ పుట్టా, ఎమ్మెల్యేలు చింతమనేని, ధర్మరాజు, రఘురామకృష్ణం రాజు, బడేటి అందించిన సహకారం అభినందనీయం. త్వరలోనే సుప్రీంకోర్టు నియమించిన కమీటీ కొల్లేరులో పర్యటిస్తుంది.” అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.