KTR : కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు
- కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు
- లగచర్లలో మహిళలపైనా దాడులు చేశారు
- బాధితుల పక్షాన NHRCకి వెళ్లాం
- రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. “బీఆర్ఎస్ లాంటి పార్టీ మాకు అండగా ఉంది కాబట్టే మేము ఈ సహాయం చేస్తున్నాం,” అని ఆడబిడ్డలు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం 40 మంది లగచర్ల రైతులను అరెస్టు చేసి జైళ్లలో చిత్రహింసలకు గురిచేసిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా హీర్యా నాయక్ అనే రైతుకు గుండెనొప్పి వచ్చినప్పుడు కూడా పోలీసులు కట్టేసిన సంకెళ్లతోనే ఆసుపత్రికి తరలించారని, ఇది మానవత్వానికి వ్యతిరేకమని మండిపడ్డారు.
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌లు స్పందించాయని, పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారని రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. “పోలీసులు ప్రయివేటు సైన్యంలా, మానవ మృగాల్లా ప్రవర్తించారన్న ఆరోపణలు నిజమయ్యాయి,” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల నరకడం, లగచర్ల రైతులపై దాడి వంటి అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ, జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర విమర్శలు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక పరాభవంగా నిలిచిందన్నారు.
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
“రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత కోల్పోయారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి,” అంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. “కొడంగల్ ప్రాంతంలోని ఆడబిడ్డలకు జరిగిన అవమానం వల్ల రేవంత్ రెడ్డి వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై దాడి చేసిన పోలీసులను సర్వీసు నుండి తొలగించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, “చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు. “ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు పదవీ విరమణ తర్వాత కూడా వదిలిపెట్టం,” అని అధికారులకు హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రజల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించింది.
US India trade deal: అమెజాన్, వాల్‌మార్ట్‌కి పూర్తి మార్కెట్ యాక్సెస్.. భారత్‌పై అమెరికా ఒత్తిడి..
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..