Female Hostages Released: గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా…
Nigerian Army: నైజీరియా సైన్యం శుక్రవారం తన తాజా భద్రతా ఆపరేషన్‌లో 79 మంది ఉగ్రవాదులు, కిడ్నాపర్‌లను హతమార్చినట్లు వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఈశాన్య నైజీరియాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల తిరుగుబాటుదరు అలాగే నార్త్-వెస్ట్ ప్రాంతంలో సాయుధ గ్రూపుల దాడులను లక్ష్యంగా చేసుకుని చేపట్టబడింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈశాన్య ప్రాంతంలో దాదాపు 35,000 మంది పౌరులు మరణించారు. అలాగే 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో, నైజీరియా తమ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది.…
Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి…
North Korea: ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. కేవలం ఆ దేశం అణు ప్రయోగాలను మాత్రమే అక్కడి జాతీయ మీడియా ఛానెల్ చెబుతుంది. అయితే తాజాగా దక్షిణ కొరియా నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనటకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రజలు ‘జీవించే హక్కు’ అక్కడి ప్రభుత్వం కాలరాస్తోంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.
College Students Sentenced To Death By Myanmar Junta: మయన్మార్ లో ప్రజాపాలనను గద్దె దించి అక్కడ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం చేశారు. అయితే ఈ ఉద్యమాన్ని అక్కడి జుంటా ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణచివేసింది. ఉద్యమంలో పాల్గొన్న వారిని కాల్చేస్తూ చాలా మందిని చంపేశారు. ఇదిలా ఉంటే సైనికపాలనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అనేక ఆరోపణలతో వరసగా ఉరి తీస్తోంది సైనిక…
Jail Term: సహజంగా ఖైదీలు శిక్షా కాలం ముగియటం కన్నా ముందే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటారు. సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ అప్లికేషన్ ఆమోదం పొందితే రిలీజ్ అవుతారు. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉంటాయి. కానీ
ఇస్లామిక్ దేశంలో నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలసిందే. కన్నుకు కన్ను.. చేయికి చేయి.. ప్రాణానికి ప్రాణం అన్న రీతిలో అక్కడ శిక్షా పద్దతులు ఉంటాయి. ఇప్పటీక ఇరాక్, ఇరాన్, సిరియా, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో బహిరంగంగానే మరణశిక్షలు అమలు చేయబడుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఎన్నిసార్లు గొంతెత్తినా.. ప్రయోజనం లేదు. మధ్యయుగం నాటి ఈ మరణ శిక్షా పద్దతులను విరమించుకోవాలని పలు హక్కుల సంస్థలు కోరుతున్నాయి.
ఉత్తర కొరియాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆకలి, పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి క్వింటానా నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విరుచుకుపడ్డారు. క్వింటానా నివేదిక ద్వేషపూరితమైన అపవాదుగా ఉందని, తమ దేశంలోని వాస్తవ పరిస్థితులు, ప్రజల జీవన విధానం తెలియకుండా నివేదికలు తయారు చేస్తున్నారని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం తీసుకున్న స్వీయరక్షణ ఏర్పాట్లను పేర్కొన్నారని కిమ్ విమర్శించారు. తాము ఈ నివేదికను గుర్తించడం…