Home Minister Amit Shah's visit to Jammu and Kashmir: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా తొలిసారిగా శ్రీ మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఝి చాట్ హెలిప్యాడ్ నుంచి కట్రా చేరుకున్నారు అమిత్ షా. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితెంద్ర సింగ్ ఉన్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు…
Udhampur Blast : సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎనిమిది గంటల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఆగి ఉన్న రెండు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే ఉగ్రవాదాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో వివిధ కోణాల్లో ఉగ్రకోణాన్ని దర్యాప్తు చేశామని.. ఈ ఘటనలో మహ్మద్ అమీన్ భట్ అనే నిందితుడి ప్రమేయం ఉన్నట్లుగా కాశ్మీర్…
Peace Pact Signed With 8 Tribal Militant Groups Of Assam: అస్సాం ప్రభుత్వం, గిరిజన తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఈ ఒప్పందం ముందడుగు కానుంది. అస్సాంతో దశాబ్ధాల కాలంగా ఉన్న తీవ్రవాద సమస్యను పరిష్కరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 8 తీవ్రవాద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గురువారం గౌహతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి…
Krishnam Raju: లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) మరణంపై యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఓ గొప్ప నటుడు మరణించడంతో దేశవ్యాప్తంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విని ఒక్కసారిగా సినీలోకం, ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుముశారు.
Daggubati Purandeswari: బీజేపీ పార్టీ పురందేశ్వరికి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి పురందేశ్వరిని తొలగించింది బీజేపీ నాయకత్వం. ఒడిశా రాష్ట్రంలో పదవిని తగ్గించడంతో పాటు ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒడిశా రాష్ట్రంలో ఇంఛార్జుగా ఉన్న పురందేశ్వరిని సహ ఇంఛార్జికి పరిమితం చేసింది. పురందేశ్వరీ వ్యవహార శైలిపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ కారణం వల్లే గత నెలలో ఒడిశా బాధ్యతలు.. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ బాధ్యతల…
Supreme Court set to hear pleas challenging Citizenship Amendment Act (CAA) on September 12: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)-2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 12న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం ఈ అంశానికి వ్యతిరేకంగా నమోదైన 200కి పైగా పిటిషన్లను విచారించనుంది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు కొన్ని చోట్ల…
Home Minister Security Breach: మహారాష్ట్రలో హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో లోపం ఏర్పడింది. ఓ వ్యక్తి హోం మంత్రి భద్రతను ఉల్లంఘించాడు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అయితే ఆ సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హోంశాఖ అధికారిగా నటిస్తూ.. నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతూ అమిత్…
Telangana Vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో సాయుధ దళాలతో పెరేడ్ నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కావడానికి సిద్ధం అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వరదల వల్ల తెలంగాణలో జరిగిన నష్టంపై అమిత్ షాను కలుస్తారని చెబుతున్నారు.
కేంద్ర ప్రవేశపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్ ’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్,తెలంగాణ, యూపీ,హర్యానా, తమిళనాడు, గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళనలు చేశారు. బీహార్, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీహార్ లో రైల్వే ఆస్తులే లక్ష్యంగా పలు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. స్టేషన్లను ధ్వసం చేశారు. తెలంగాణ సికింద్రాబాద్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనల్లో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే…