ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి…
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదని దుయ్యబట్టారు..
గత కొన్ని రోజులుగా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ పేరుతో రాజకీయ పోరాటం సాగుతోంది. పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ సహా పలు రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంది.
మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. దీని తర్వాత.. తన ప్రసంగంలో అమిత్ షా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.
Chandrababu- Amit Shah: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం సంప్రదింపులు జరుపుతూన్నారు. ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఏపీలోని వరద పరిస్థితులను అమిత్ షాకు వివరించగా.. అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యతతో గెలుపొందిన గత రికార్డును ఐదుగురు అభ్యర్థులు బద్దలు కొట్టారు. అందులో బీజేపీకి చెందిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. ఇండోర్ నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
Amit Shah : నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2029 తర్వాత కూడా ఆయనే మా నాయకుడిగా కొనసాగుతారు.