Koti Deepotsavam Day 13 : హైదరాబాద్ నగరం మరోసారి భక్తి జ్వాలతో ప్రకాశించింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించిన కోటి దీపోత్సవం 2025 పదమూడు రోజుల ఆధ్యాత్మిక యాత్ర విజయవంతంగా ముగిసింది. భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కార్తీకమాసంలో నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా సాగి, భక్తుల మనసులను పరవశింపజేసింది. విశేష పూజలు, ప్రవచనాలు, కల్యాణోత్సవాలు, వాహన సేవలతో ప్రతి రోజు భక్తి పరవశంతో నిండిపోయింది.

సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఆధ్యాత్మిక విలువల వ్యాప్తి లక్ష్యంగా ప్రారంభమైన ఈ దీపోత్సవం, ఇప్పుడు లక్షలాది దీపాలతో ప్రకాశించే మహా దీపోత్సవంగా అవతరించింది. హైదరాబాద్ అంతా దీపాల వెలుగులతో తళుక్కుమని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. పదమూడు రోజుల ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు భక్తి ఉత్సాహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ రోజు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ (శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు, శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం) అనుగ్రహ భాషణం అందించి భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపారు. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం భక్తులను ఆధ్యాత్మికతలో ముంచెత్తింది.
వేదికపై కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవార్లకు కోటి గాజుల అర్చన వైభవంగా నిర్వహించబడింది. అనంతరం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, మధురై మీనాక్షి దేవీ కల్యాణోత్సవాలు కన్నుల పండువగా సాగాయి. నంది వాహన పల్లకీ సేవలో స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని అందించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, లింగోద్భవ దర్శనం, సప్తహారతుల దివ్య క్షణాలు మొత్తం వేదికను భక్తి తరంగాలతో నింపాయి. ఈ రోజు జరిగిన మహోత్సవానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై దీపోత్సవ నిర్వాహకులను అభినందించడం వేడుకకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది కోటి దీపోత్సవం విజయవంతంగా ముగిసినప్పటికీ, భక్తుల హృదయాల్లో దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి.. సనాతన ధర్మ దీపం చిరస్థాయిగా వెలుగుతుందన్న సంకేతంగా.
సర్వతోముఖాభివృద్ధి కటాక్షం “మధురై మీనాక్షి కల్యాణోత్సవం”#BhakthiTV #Kotideepotsavam2024 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/D6rCQndOUt
— BhakthiTV (@BhakthiTVorg) November 13, 2025
కోటి దీపోత్సవం పదమూడో రోజున పల్లకీలపై కంచి – మధురై ఉత్సవమూర్తుల ఊరేగింపు..#BhakthiTV #Kotideepotsavam2024 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/czfj3QB9uB
— BhakthiTV (@BhakthiTVorg) November 13, 2025
గౌరవ తెలంగాణ సినీ ఆటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు @ కోటిదీపోత్సవం-2025@KomatireddyKVR #komatireddyvenkatreddy #BhakthiTV #Kotideepotsavam2024 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/IMkpf2RHBu
— BhakthiTV (@BhakthiTVorg) November 13, 2025