Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరుగుతోంది. ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమంలో చేరి గంగామాతకు మనసారా పూజలు చేస్తున్నారు. ఈ వేడుక జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకు దాదాపు నలభై అయిదు రోజులపాటు కొనసాగుతుంది.
పండితుల ప్రకారం, కుంభమేళా పుణ్యస్నానాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం, గంగమ్మతల్లిని ఆచారమయిన విధంగా పూజించడం అత్యంత పరమార్థంగా ఉంటుంది. ఈ వేడుక, క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత భాండం కథతో సంబంధం కలిగి ఉంటుంది. దేవతలు, రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగే పోరాటంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై నాలుగు ప్రధాన నదుల్లో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ నాలుగు నదులు, గంగ, శిప్రా, గోదావరి, , త్రివేణి సంగమం (ప్రయాగ్‌రాజ్) అత్యంత పవిత్రతను సంపాదించుకున్నాయని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. ఈ నదుల నీళ్లు కొన్ని సమయాలలో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని భావిస్తారు, కుంభమేళా సమయం నడుమ కోట్లాది భక్తులు ఈ నదుల్లో స్నానం చేస్తారు.
కుంభమేళా సమయాన్ని నిర్ణయించడానికి ఆకాశంలోని గ్రహాల కదలికలను, ముఖ్యంగా బృహస్పతీ, సూర్యచంద్రుల గమనాలను ఆధారంగా తీసుకుంటారు. కుంభమేళా రెండు రకాలుగా జరుపుతారు: అర్ధ కుంభమేళా (ఒకటి ఆరేళ్లలో ఒకసారి) , మహాకుంభమేళా (పన్నెండు సంవత్సరాల్లో ఒకసారి). మహాకుంభమేళాను, బృహస్పతీ యొక్క కదలికలు, 12 సంవత్సరాల రాశి చక్రాన్ని పూర్తి చేయడమే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్నది మహా కుంభమేళానే. మహా కుంభమేళా ఈసారి దేవతల గురువు బృహస్పతీ వారి కదలికల ఆధారంగా నిర్ణయించబడింది.
ఈ సారి ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు విశేష సంఖ్యలో తరలివచ్చారు..అఖాడాలు, సాధుసంతులు. మేళాలో పాలుపంచుకుంటున్న వివిధ అఖాడాల సంస్థల ప్రతినిధులు..సాధువుల కూటములు ఈనెల 27న సనాతన్ బోర్డు రాజ్యాంగ ముసాయిదాను విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపాయి. మేళాలోని నిరంజని అఖాడాలో పలువురు సాధువుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షులు, మానసాదేవి మందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు అయిన శ్రీ మహంత్ రవీంద్రపురీజీ మహారాజ్ మాట్లాడుతూ…నిత్యం సనాతన ధర్మం కోసమే పాడుపడుతున్న అఖాడాలు..సనాతనధర్మానికి సంబంధించి ప్రత్యేకంగా యోగ్యులైన వారితో బోర్డు ఏర్పాటు చేయాలని అన్ని అఖాడాలు కోరుతున్నాయన్నారు. అయితే.. ఈ మహాకుంభ మేళాకు ఎలా వెళ్ళాలి..? ఏ తేదీల్లో పుణ్యస్నానాల చేయాలి..? ఎక్కడ బస చేయాలి.? పూర్తి వివరాలు వీడియోలో చూడండి..