Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- నేటి నుండి దుబ్బారాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- సాయంత్రం స్వస్తి పుణ్య వాచనంతో అంకురార్పణ కార్యక్రమం
- 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubba Rajanna Swamy: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో వెలిసిన దుబ్బ రాజన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 24న సాయంత్రం స్వస్తి పుణ్య వాచనంతో అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 25న రాత్రి భక్తుల సమక్షంలో స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న భక్తులు జాగరణ చేస్తారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరగనుండగా, అనంతరం రుద్రాభిషేకం, నిషిపూజలు నిర్వహించనున్నారు.
Read also: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా యువకుల చేరిక..
Also Read
బ్రహ్మోత్సవాల చివరి రోజు ఫిబ్రవరి 28న స్వామి వారి రథోత్సవం ఘనంగా జరపనున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. స్వామి వారి దివ్య దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ భాగస్వామ్యం అవ్వాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Read also: Virat Kohli Record: ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు