కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సోమవారమే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్దా పదవీకాలం త్వరలోనే ముగుస్తుంది. ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్…
హిమాచల్ ప్రదేశ్‌లో శీతాకాలంలో విపరీతమైన చలి ఉంటుంది. అయినప్పటికీ.. అక్కడ ప్రతిరోజూ అగ్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీని వల్ల కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లుతుండగా, చాలా కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. తాజాగా సిమ్లాలో అగ్నిప్రమాదం ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం కారణంగా 9 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అందిన సమాచారం ప్రకారం.. సిమ్లా జిల్లాలోని జుబ్బల్‌లోని చాలా ఇళ్లలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 9 కుటుంబాలకు చెందిన సుమారు 81 కార్లు దగ్ధమయ్యాయి. ఈ…
రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. కొంచెం మంచిగా నటించి మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌పై సిమ్లాలోని లూథియానాకు చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పౌల్టీఫారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి పౌల్ట్రీ ఫామ్‌లోని సుమారు 5 వేల కోళ్లు బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహతైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
ప్రస్తుతం హిమల్చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.…
ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇచ్చింది అని ఆ రాష్ట్ర మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
PM Modi Celebrate Diwali 2023 with Indian Security Forces: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని.. సైనికులతో కలిసి అక్కడ వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ప్రధాని.. సైనికులతో ముచ్చటిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ధైర్యవంతమైన భారత…
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, హమీర్‌పూర్‌లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్‌ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం కులు, మండిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులను పరామర్శించి వారితో కలిసి బాధలను పంచుకున్నారు.