Apple Price Hike: ఆకాశాన్నంటుతున్న యాపిల్ పండ్ల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది. ఇప్పుడు దీని ప్రభావం ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్‌పై కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీంతో ఆహార సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ ప్రభావం ఢిల్లీలోని ఆపిల్ హోల్‌సేల్ మార్కెట్‌పై పడింది. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం ఎప్పుడూ వ్యవసాయానికి, వ్యాపారానికి నష్టం చేకూరుస్తుందని ఓఖ్లాలోని ఓ షాపు యజమాని చెప్పాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి బంగాళాదుంప, యాపిల్, నేరేడు వంటి పండ్ల హోల్‌సేల్‌లో హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
యాపిల్ ధర ఎంత పెరిగింది
నిజానికి యాపిల్ బాక్స్ ధర వెయ్యి రూపాయలు ఉండాలి. వర్షం కారణంగా దాని ధర 2 వేల రూపాయల నుండి 3 వేల 500 రూపాయలకు పెరిగిందని దుకాణదారుడు చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్‌లో రహదారులు దెబ్బతిని అధ్వాన్నంగా ఉండడంతో రైతులు ఒకే ట్రక్కులో పండ్లను ప్యాక్ చేస్తున్నారు. దీని కారణంగా ఈ పండ్లు త్వరగా కుళ్లిపోతున్నాయి. దీంతో పండ్ల సరఫరా దెబ్బతినడంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతోంది.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
Read Also:Apple USB-C Port: యాపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 14 మోడళ్లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్!
ఆపిల్ సరఫరా సమస్య
ఆజాద్‌పూర్ మండికి చెందిన ఒక దుకాణదారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆపిల్‌ల సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో తాజా యాపిల్స్ సరఫరా కూడా జరగడం లేదు. అయితే, ఏదో ఒకవిధంగా మధ్య మార్గాల ద్వారా ఆపిల్‌లను సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తను తెలిపాడు.
7,480 కోట్లకు పైగా రాష్ట్రం నష్టం
ఈ సంవత్సరం రుతుపవనాల 54 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో 742 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది 50 ఏళ్లలో సరికొత్త రికార్డు అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షం కారణంగా 1,200 రోడ్లు మూసుకుపోయి రూ.7,480 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
Read Also:Hot Chocolate: విమానంలో హాట్ చాక్లెట్.. చిన్నారికి గాయాలు
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!