Pakistan: పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కో ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులు తప్పకుండా హిజాబ్ ధరించి రావాాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై అక్కడి మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ లో పేర్కొంది.
Read Also: Rs.425crore worth Drugs seized : ఇరాన్ బోటు నుంచి రూ.425కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
స్థానిక ప్రభుత్వ ఈ చర్యను సీనియర్ జర్నలిస్ట్ మరియానా బాబాట్ తప్పపట్టారు. మహిళలు తాము ధరించే హక్కును కలిగి ఉన్నారని, వారికి స్వేచ్ఛ ఉందని అన్నారు. అయితే కొంత మంది మాత్రం ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి దీవాన్ ఆలీ ఖాన్ చుగ్తాయ్ మాట్లాడుతూ… తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అడిగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వనరుల కొరత కారణంగా బాలికలు, బాలురు కలిసి చదువుకోవాల్సి వస్తోందని మంత్రి అన్నారు. జర్నలిస్ట్ ముర్తాజా సోలాంకి దీనిని బానిసత్వంలో పోల్చాడు. ఇది రాజకీయ జిమ్మిక్కు అంటూ కొందరు నెటిజెన్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖిజార్ హాత్ అబ్బాసి అనే మరో జర్నలిస్ట్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించాడు.